Yentha Dooramaina

MP3 Download(Right Click – Save Link As)

NEW: 1860 Holy Bible Telugu New Testament is posted here.  New mobile wallpaper added on Psalm 119:30.

ఎంత దూరమైనా అది ఎంత భారమైన
యేసు వైపు చూడు నీ భారమంత తీరు |2| తీరానికి చేరు

1. నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా |2|
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా ||యేసు వైపు చూడు||

2. తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా |2|
నిశీధీలో ప్రకాశించు మృత్యుంజయుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా ||యేసు వైపు చూడు||