Maa inti peru pasuvula paka

Maa inti peru pasuvula paka MP3 (Download here)

మా ఇంటి పేరు పశువుల పాక
ప్రక్కింటి పేరు ఒలీవల తోట
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట
||మా ఇంటి పేరు||

1. మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో
మోకాళ్ళ కన్నీళ్ల  ప్రార్థించె చూడు
||మా ఇంటి పేరు||

2. మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు
తగ్గింపు ప్రార్ధన సమర్పణలో
మార్గము సత్యము జీవము
||మా ఇంటి పేరు||