Maha Viveki Yesayya

Maha Viveki Yesayya MP3 (Download here)

మహవివేకి యేసయ్య నా మదిలో
మందసమాయెను, మహానుభావుడు యేసయ్య
నాలో మ్రోగెను మృదంగమై, నిన్న నేడు రేపు ఎన్నడైన|2|
మారని త్రియేకుడు, మహిలో మన యేసుడు|2|
||మహవివేకి యేసయ్య||

ఓబేదెదోము ఇంటిలో మందసము ఉండగా
దేవుని దీవెనలు మెండుగా నిండెను|2|
దావీదు ఒంటిలో దేవుని స్తుతి వుండగ|2|
సితారాను సంధించి సదా ప్రభుని స్తుతియించి|2|
దేవుని దయపొందెను దావీదు దేవుని దయపొందెను.
||మహవివేకి యేసయ్య||

దేవునినీడలో దీనురాలు ఎస్తేరు
కన్యకలు అందరిలో రాజుదయపొందెను|2|
మోయాబుదేశములో అన్యురాలు రూతు|2|
బెత్లెహేము పురమందు బోయాజు పొలమందు|2|
దేవుని దయపొందెను ఆ రూతు దేవుని దయ పొందెను.
||మహవివేకి యేసయ్య||