మాటలాడని మౌనమా v2

Prana tyagamu chesina – Maataladani Mounama MP3 (Click here)

ప్రాణ త్యాగము చేసిన నా దైవమా రక్తమంతా ఓర్చిన నా జీవమా ||2||

మాటలాడని మౌనమా మనసు తెలిసిన దైవమా
మరచిపోని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీవె నాకిల జీవము నా జీవము
||మాటలాడని||

కఠినులైన మనుషులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి ||2||
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన
||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరస్సున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి ||2||
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2||
క్షమాపననే చూపిన ||మాటలాడని||

మాటలాడని మౌనమా

Maataladani Mounama MP3 (Click here)

మాటలాడని మౌనమా మమత చూపిన దైవమా
మరువలేని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీదు సిలువలో త్యాగము పర జీవము ||మాటలాడని||

కఠినమైన మనుజులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన ||2|| ||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరమున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2|| ||మాటలాడని||

సిలువలో సాగింది యాత్రా

Telugu Christian Lyrics – Siluvalo Saagindi

Siluvalo Saagindi Yatra MP3 (Click here)
(Click the “Download Arrow” button at the top to listen MP3.)

 సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర
 ఇది ఎవరి కోసమో…. ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే…

1. పాలుగారు దేహముపైనా – పాపాత్ముల కొరడాలెన్నో
 నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి
 నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా ||ఇది||

2. వెనుక నుండి తన్నింది ఒకరు – తనముందు నిలచి నవ్వింది మరియొకరు
 బంతులాడినారు పలు బాధలు పెట్టినారు
 నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా  ||ఇది||

3. చెళ్ళుమని కొట్టింది ఒకరు – తన మోముపైన ఊసింది మరియొకరు
 గేలిచేసి నారు పరిహాస మాడినారు
 నోరుతెరువ లేదాయె ప్రేమా…బదులు పలుక లేదాయె ప్రేమా  ||ఇది||