NeeVale Nanninthaga

NeeVale Nanninthaga MP3 (Download here

నీవలే నన్నింతగా ప్రేమించలేదెవ్వరు
నీవలె నాకై ప్రాణము ఇవ్వలేదెవ్వరు
నా ప్రాణ ప్రియుడా శ్రీ యేసు విభుడా |2|
నీ ప్రేమ మధురం మధురాతి మధురం|2|
నీ ప్రేమయే నాకాధారము
ప్రభు నీవేగా నాదు ఆశ్రయము
||నీవలే నన్నింతగా||

దారి ప్రక్కన పడియుంటిని
నే దారి తప్పి చెడియుంటిని|2|
యెల్లరు నను దాటిపోయిరి|2|
జాలియే చూపకను
నీవైతే నన్ను లేవనెత్తి
నాకు నీదు జీవమిచ్చి
నీదు గృహమున చేర్చితివే
ప్రభు నాకు సేదను తీర్చితివే
||నీవలె నన్నింతగా||

నాదు గతమును చూడలేదు
నా దోషములను ఎంచలేదు|2|
నీదు రూపును నాదు ముఖమున|2|
చూచి ఎంతో మురిసితివే
నీ రక్తమిచ్చి నన్ను కొంటివి
నీతిమంతునిగా నన్ను తీర్చి
వారసునిగా చేసితివే
ప్రభు నన్ను మహిమ పరచితివే
||నీవలే నన్నింతగా||

Deva Nee Krupa Choppuna

Deva Nee Krupa Choppuna MP3 (Download here

దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము
నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున
నా అతిక్రమములు తుడిచివేయుము
నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము
నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
||
దేవా, నీ కృపచొప్పున||

ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు
నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము
హిమముకంటె తెల్లగా నేనుండునట్లు నన్ను కడుగుము.
ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము
అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును
|| 
దేవా, నీ కృపచొప్పున||

నా దోషములన్నిటిని తుడిచివేయుము
స్థిరమైన మనస్సు నూతనముగా నుంచుము
నా దోషములన్నిటిని తుడిచివేయుము
నాయందు శుద్ధహృదయము కలుగజేయుము
నీ సన్నిధిలోనుండి త్రోసివేయకు
నీ పరిశుద్ధాత్మ నానుండి తీసివేయకు
నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము
సమ్మతిగలిగిన మనస్సుతో నన్ను దృఢపరచుము.
|| దేవా, నీ కృపచొప్పున||

Yehova Naa Deva

Yehova Naa Deva MP3 (Download here

యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను|2|
నన్ను తరుమువారిచేతిలోనుండి నన్ను తప్పించుము.
నన్ను తప్పించువాడెవడును లేకపోగా
యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను.

వారు సింహమువలె ముక్కలుగా చీల్చివేయకుండ
నన్ను తప్పించుము, యెహోవా నా దేవా,
నేను ఈ కార్యముచేసినయెడల
నాచేత పాపము జరిగినయెడల
నాతో సమాధానముగా నుండినవానికి
నేను కీడుచేసినయెడల |2|||యెహోవా నా దేవా||
శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము
నా ప్రాణమును నేలకు అణగద్రొక్క నిమ్ము |2|
నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము |2|
నిర్నిమిత్తముగా నన్ను బాధించినవారిని
నేను సంరక్షించితిని గదా.
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||

యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము
నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము |2|
నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము |2|
న్యాయవిధిని నీవు, నియమించియున్నావు కదా|2|
||యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చియున్నాను||

Baatasaari O Baatasaari

Baatasaari MP3 (Download here

బాటసారి ఓ బాటసారి,వినవయ్యా ఒక్కసారి|2|
పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి
వినవయ్యా ఒక్కసారి

వెండి తాడు విడిపోవును
బావి యొద్ద చక్రం పడిపోవును |2|
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2|
నీటి బుడగలాంటిదీ జీవితం |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

పరదేశులం యాత్రీకులం
శాశ్వతం కాదు ఈ దేహం |2|
మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2|
ఆత్మ దేవుని యొద్దకు చేరును |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

నీ జీవిత గమ్యమెక్కడో
యోచింపవా ఓ మానవా |2|
అగ్ని ఆరదు పురుగు చావదు|2|
నిత్య నరకమునకు పోవద్దురా|2|
యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో|2|
||బాటసారి||

Special song (Manavuda oh Manavuda) 

Special Song2: Kannu teristhe velugura 

Yetu Vypu Nee Payanamo

Yetu Vypu Nee Payanamo MP3 (Download here

ఎటువైపు నీ పయనమో నేస్తమా
హోరుగాలిలో చిరుదీపమా |2|
ఇటువైపు మరణం అటువైపు జీవం |2|
నీ గమ్యం ఏమిటో గమనించుకొనుమా |2|
||ఎటువైపు||

శత్రువగు సాతాను మిత్రునివలే చేరి
నీ జీవితాన్ని కూల్చియున్నదా |2|
నిజ స్నేహితుడైన యేసయ్యను చేరుమా…
నీ కొరకై తన ప్రాణం అర్పించెనే |2|
||ఎటువైపు||

కారుచీకటిలో కానరాని మార్గమున
తిరుగాడుచుంటివని పరికించుకొనవా|2|
నేనే మార్గం సత్యం జీవమని…
ఆశ్చర్యమైన వెలుగు యేసే అని తెలుసుకో|2|
||ఎటువైపు||

ఎండమావి లాంటి లోకములో నీవు
ఆశలన్ని ఆవిరై అలమటించువేళ|2|
నిత్యజీవ ఊటయైన యేసయ్యను చేరితే…
జీవజల ఊటలు ప్రవహింపజేయుడా|2|
||ఎటువైపు||

Kondala Tattu

Kondala Tattu MP3 (Download here

కొండలతట్టు నా కన్నులెత్తుచున్నాను
నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
యెహోవావలననే నాకు సహాయము కలుగును
ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
ఆయన నీ పాదమును తొట్రిల్లనియ్యడు
నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడువాడు,
నీ కుడిప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును.
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు.
రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
ఏ అపాయమును రాకుండ
యెహోవా నిన్ను కాపాడును.
ఆయన నీ ప్రాణమును కాపాడును.
ఇది మొదలుకొని నిరంతరము
నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును.

Naa Pranam Yehova Ninne

Naa Pranam Yehova MP3 (Download here)

నా ప్రాణం యెహోవా(యేసయ్యా)
నిన్నే సన్నుతించుచున్నది
నా అంతరంగ సమస్తము
సన్నుతించుచున్నది |2|
నీవు చేసిన మేలులను
మరువకున్నది|2|
నా దేవా నా ఆత్మ
కొనియాడుచున్నది|2|
||నా ప్రాణం||

ఉత్తముడని నీవే అనుచు
పూజ్యుడవు నీవే అనుచు|2|
వేల్పులలోన ఉత్తముడవని
ఉన్నవాడనను దేవుడనీ|2|
నా దేవా నా ఆత్మ
కొనియాడుచున్నది|2|
||నా ప్రాణం||

ఆదిమధ్య అంతము నీవని
నిన్న నేడు నిరతము కలవుఅని|2|
నా పితరుల పెన్నిది నీవని
పరము చేర్చు ప్రభుడవు నీవని|2|
నా దేవా నా ఆత్మ
కొనియాడుచున్నది|2|
||నా ప్రాణం||

Jeevadhipathi Naa Yesayya

Jeevadhipathi Naa Yesayya MP3 (Download here

జీవాధిపతి నా యేసయ్యా
నా మంచి కాపరి
మరణపు ముల్లును విరిచిన
నా రాజు నా యేసయ్యా |2|
||జీవాధిపతి||

కష్టాలలో కన్నీళ్ళలో
నన్ను ఆదరించితివి
శాంతి నొసగి నీ సన్నీధిలో
నన్ను నిలుపుకుంటివి |2|
నీకేమి చెల్లింతును
నా జీవితం అర్పింతును |2|
||జీవాధిపతి||

పాప ఊబిలో పడియుండగా
నన్ను పైకి లేపితివి
రక్షణ నొసగి నీ రక్తముతో
నన్ను కడిగితివి|2|
నీకేమి చెల్లింతును
నా జీవితం అర్పింతును|2|
||జీవాధిపతి||

మరణచ్ఛాయలో నేనుండగా
నన్ను బ్రతికించితివి
కరుణ చూపి నీ కృపతో
నన్ను బలపరచితివి|2|
నీకేమి చెల్లింతును
నా జీవితం అర్పింతును|2|
||జీవాధిపతి||

Yesayya Yesayya

Yesayya Yesayya MP3 (Download here

“నేను కృపనుగూర్చియు న్యాయమునుగూర్చియు పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను.” -కీర్తన 101:1

యేసయ్యా యేసయ్యా |2|
నిన్నే కీర్తించెదా, కృపను గూర్చి నే పాడెదా
నీ కృపను గూర్చి నే పాడెదా|2|

ఎండిన ఎడారిలో నా జీవితం
బీడుబారిపోగా|2|
సిలువ ప్రవాహం నీ జలధారలు|2|
నాలో ప్రవహించె నా యేసయ్య|2|
||యేసయ్యా యేసయ్యా||

నీవు ఉన్న నా హృదయము
ఆనంద భరితము కాగా|2|
ఆత్మ ప్రభావం నీ పరిశుద్ధతా|2|
నాలో నివహించె నా యేసయ్య|2|
||యేసయ్యా యేసయ్యా||

ఇంతకాల నిరీక్షణ కనుల
ముందుకు రాగా|2|
సియోనులో నీ ముఖము చూస్తూ  |2|
పరవసించి పాడాలి నా యేసయ్య |2|
||యేసయ్యా యేసయ్యా||

Yesayya Naa Pranamayya

Yesayya Naa Pranamayya MP3 (Download here

యేసయ్యా నా ప్రాణమయ్యా
నీవే నా ప్రాణమయ్యా |2|
నీవేనయ్యా నా ఊపిరయ్యా  నా ఊపిరయ్యా
నిత్యము నిన్నయ్యా కొనియాడెదనయ్యా |2|
ప్రాణమైన యేసయ్యా నా ప్రాణమైన యేసయ్యా
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నా పాపము క్షమియించుమయ్యా
నాలోన నీవుండమయ్యా |2|
నీ ప్రేమ నా పైన దయచేయుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నా దోషము తొలగించుమయ్యా
నీ రక్తముతో శుద్దిచేయుమయ్యా|2|
నీ అభిషేకము నా కియ్యుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నీ వాక్యముతో నడిపించుమయ్యా
నీ మాటలతో బ్రతికించుమయ్యా |2|
నీ మహిమతో నను నింపుమయ్యా |2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

నీ ఆత్మను నా కియ్యుమయ్యా
నీ మార్గము చూపించుమయ్యా |2|
నీ రాజ్యమునకు కొనిపోవుమయ్యా|2|
||యేసయ్యా నా ప్రాణమయ్యా||

Athmabhishekamu anandame

Athmabhishekamu anandame MP3 (Download here

NEW: Ananda Keerthanalu 2018 Songsbook (PDF) posted here.

ఆనందమానంద మానందమే ఆత్మాభిషేకము ఆనందమే |2|
నా యేసు చేసిన వాగ్దానమే |2| నను నింపే ఆత్మతో ఆనందమే |2|
ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన |2|
||ఆనందమానంద మానందమే||

మేడగదిపై ఆ భక్తులు పొందిన అభిషేక అనుభవమే |2|
నాల్కలుగా అగ్ని దిగిరాగా |2| మైమరచి ప్రవచించె బహుభాషలు|2|
ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన |2|
||ఆనందమానంద మానందమే||

దీనాత్ములైన ఆ అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగ |2|
పేతురు వాక్యము ప్రకటింపగా |2| దిగివచ్చె ప్రభు ఆత్మ అభిషేకమే|2|
ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన |2|
||ఆనందమానంద మానందమే||

Nee Aradhana

నీ ఆరాధన హృదయ ఆలాపనా
ఆత్మతో సత్యముతో . .
ఆరాధించెదను ఆరాధించెదను
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన క్రీస్తు ఆరాధన

1. అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా |2|

2. స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు |2|

Naa Jeevitaniki

Naa Jeevitaniki MP3 (Download here

నా జీవితానికి ఓ భాగ్యమా
మమతలు కురిపించే అనుబంధమా
చేదైన బ్రతుకుకు ఓ నేస్తమా
నే మరువలేని నా ప్రాణమా
యేసయ్యా నీవు నా తండ్రివి
యేసయ్యా నేను నీ సొత్తును |2|

మన్నును ఎన్నుకొన్నదీ నీ సంకల్పం
నిలిపెను సారెపై నీ ఉద్దేశ్యం |2|
రూపము నిచ్చాము జీవము పోశావు |2|
పరిశుద్ధ ఘటముగా నిలిపావయ్యా
యేసయ్యా నీవు నా కుమ్మరి
యేసయ్యా నేను నీ రూపును |2|

ప్రేమతో పెనవేసెను నిను నా జీవితం
సారము ధారపోయగా ఫలియించితి |2|
నాలో నిలిచావు నీతో నిలిపావు |2|
శ్రేష్ఠఫలములు నిచ్చావయ్యా
యేసయ్యా నీవు నా వల్లీవి
యేసయ్యా నేను నీ తీగను |2|

Yehova Neeve Naa Ashrayam

Yehova Neeve Naa Ashrayam Mp3 (Download here)

యెహోవా నీవే నా ఆశ్రయం ఆధారం
వేటకాని ఉరిలో నుండి విడిపించినావే
నాశనకరమైన తెగులు రాకుండా చేసితివే
దీర్ఘాయువు చేత నన్ను తృప్తి పరతునని
గొప్ప చేతునని అభయమందించిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

రాత్రి కలుగు భయమునకైన
పగలు ఎగురు బాణముకైన
చీకటిలో సంచరించు
ఎటువంటి తెగులునుకైనా
మధ్యాహ్నమందున
పాడు చేయు రోగముకైన
జడియకుము నేనున్నానని
గొప్ప అభయమందించిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

వేయి మంది నీ ప్రక్క పడిన
పదివేలుగ కుడి ప్రక్క కూలిన
ఆపదలు ఏ అపాయములు
నీ దరికి చేరలేవు
నిన్ను కాచి కాపాడుటకు
నా దూతలకాజ్ఞాపింతును, కనుక
నీవు భయపడవలదని వాగ్దానమిచ్చిన
||యెహోవా నీవే నా ఆశ్రయం ||

Aadarane lekapothe

Aadarane lekapothe MP3 (Download here

“నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.” – కీర్తన 94:19

ఆదరణే లేకపోతే బ్రతుకలేనూ
తండ్రీ నీ ఆదరణే నాకు చాలును |2|
నను ఓదార్చింది నీ ఆదరణే
నను బలపరచింది నీ ఆదరణే|2|
||ఆదరణే||

బలహీన సమయంలో బలపరచుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే|2|
చెదరిన నా మనసును దృఢపరచుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే
బ్రద్దలైన గుండెను ఓదార్చుటకు
నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే |2|
||ఆదరణే||

అందరూ నన్ను వెలివేసినప్పుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే |2|
సూటిపోటి మాటలతో కుమిలినప్పుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే
శోధన వేదన బరువైనపుడు
తోడుగ నిలిచింది నీ ఆదరణే|2|
||ఆదరణే||

Yesayya Nee Krupa

Yesayya Nee Krupa MP3 (Download here

యేసయ్యా ……………
నీ కృప నాకు చాలయ్యా…. నీకృపలేనిదే
నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షణము
నీ దయలేని క్షణము నేను వూహించలేను
యేసయ్యా…
నీ కృప నాకు చాలయ్యా…
నీ కృపలేనిదే నేనుండలేనయ్యా…|2|
నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము
నేవూహించలేనయ్యా.
యేసయ్యా  |2|

మహిమను విడచి మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి , మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపీ…మరురూపు నిచ్చావు …|2|
మహిలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప |2|
||యేసయ్యా నీ కృప||

ఆజ్ఞల మార్గమున  ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింజేసి
ఆనందతైలముతో అభిషేకించావు |2|
ఆ ఆశ తీరఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ..కృప
ఆ ఆశతీర ఆరాధనజేసే అదృష్టమిచ్చింది నీ కృప
||యేసయ్యా నీ కృప||

 

Yehova Rajyamu

Yehova Rajyamu MP3 (Download here)

“తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. -కీర్తన 97:10

యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకమంతయు ఆనందమే
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ద్వీపములన్నిట సంతోషమే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ |2|

నీతి న్యాయములను సింహాసనమునకు ఆధారము చేసెను |2|
ఆయన నీతిని ఆకాశము సైతం వివరించుచున్నది |2|
||యెహోవా రాజ్యము చేయుచున్నాడు||

నీతిమంతులను కాపాడువాడు కునుకడు నిద్రించడు |2|
ఆయన పరిశుద్ధ నామమునుబట్టి స్తుతులను చెల్లించుడి |2|
||యెహోవా రాజ్యము చేయుచున్నాడు||

Mahonnatuda

మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
నాజీవిత ధన్యతై యున్నది
1. మోడు బారిన జీవితాలను – చిగురింప చేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
జీవ జలముల ఊటయైనా – నీ ఓరను నను నాటితివా..
3. వాడబారని స్వాస్ధ్యము నాకై – పరమందు దాచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా..

Tellaga Telavaraka

తెల్లగ తెలవారక ముందే తొలి కోడికూయక ముందే |2|
లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె
చీల్చినాడే మృత్యుంజయుడు |2|
|| తెల్లగ తెలవారక ముందే||
1. ఈ గుడిని పడ గొట్టమన్నాడే
మూడు రోజుల్లో లేపుతానన్నాడే |2|
తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే
మాట తప్పని వాడు చేసి చూపినాడే |2|
|| తెల్లగ తెలవారక ముందే||
2. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే
యేసు దేహానికి పూయాలని తలచినారే |2|
తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే
ఖాళి సమాధిని చూసి నిజమునెరిగినారే |2|
|| తెల్లగ తెలవారక ముందే||

Siluvalo Neevu Karchina Raktham

Siluvalo Neevu Karchina Raktham MP3 

సిలువలో నీవు కార్చిన రక్తం పాపము తొలగించును |2|
కలుషము కడిగి పరిశుద్ధ పరచి జీవము కలిగించును |2|
యేసు నీ రక్తమే పాపికి చరణము |2|
యేసు నీ రక్తమే శాప హరణము |2|

సిలువలో నీవు కార్చిన రక్తం రోగము తొలగించును |2|
చీకటి శక్తులు దూరము చేసి స్వస్థత కలిగించును |2|
||యేసు నీ రక్తమే||

సిలువలో నీవు కార్చిన రక్తం వేదన తొలగించును |2|
అపాయములనుండి తప్పించి నెమ్మది కలిగించును |2|
||యేసు నీ రక్తమే||

సిలువలో నీవు కార్చిన రక్తం నిరాశను తొలగించును |2|
కన్నీరు తుడిచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించును |2|
||యేసు నీ రక్తమే||

సిలువలో నీవు కార్చిన రక్తం భయము తొలగించును |2|
అపవాది అనుచరుల అణగత్రొక్కి జయము కలిగించును |2|
||యేసు నీ రక్తమే||