తెల్లగ తెలవారక ముందే తొలి కోడికూయక ముందే |2|
లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె
చీల్చినాడే మృత్యుంజయుడు |2|
|| తెల్లగ తెలవారక ముందే||
1. ఈ గుడిని పడ గొట్టమన్నాడే
మూడు రోజుల్లో లేపుతానన్నాడే |2|
తన దేహము గూర్చి ఈ మాట చెప్పినాడే
మాట తప్పని వాడు చేసి చూపినాడే |2|
|| తెల్లగ తెలవారక ముందే||
2. స్త్రీలు సుగంధాలు సిద్ధపరచినారే
యేసు దేహానికి పూయాలని తలచినారే |2|
తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే
ఖాళి సమాధిని చూసి నిజమునెరిగినారే |2|
|| తెల్లగ తెలవారక ముందే||