ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త
యేసయ్యా ప్రచురింతు నీదు సువార్త మెస్సయ్యా
రారండి జనులారా రారండి ప్రజలారా
నేను చేసినవన్నీ నాతో చెప్పినవానిని చూశానండీ
అతడే మెస్సయ్యా ఆయనే యేసయ్యా

1. ఎండ వేళలో ఎంతో అలసి ఒంటరిగా ఒకనాడు
యాకోబు బావి దగ్గర కూర్చున్నాడే
నీటికై నేను వెళ్ళగా దాహామిమ్మని నన్నడిగాడే ||అతడే||

2. ఎరుగకనే ఎన్నో ప్రశ్నలు వేసారక అడిగానే
విసుకక నాకు వివరంగా చెప్పాడే
నేనిచ్చు నీళ్ళు త్రాగితే ఎన్నడు దప్పిక కావన్నాడే ||అతడే||

3. జీవజాలం తానన్నాడే జీవం తానన్నాడే
ఆ జలములు త్రాగాలంటే పాపపుకుండ విడువాలంట
ఆ కుండను అచటే వదలి ఆయన సాక్షిగా నేనొచ్చానే ||అతడే||