అదిగో నా నావ బయలుదేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు

1. అలలెన్ని వచ్చినా అదరను
వరదలెన్ని వచ్చినా వణకను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయంబు ఆయనే ||అదిగో||

2. లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నొ తిరుగుచున్నది
సూర్యుడైన ఆగిపోయినా
చుక్కాని మాత్రం సాగిపోవును ||అదిగో||

3. నడిజాము రాత్రిలో నడిచినా
నడిసంద్రము మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్ను అద్దరికి నడిపించును ||అదిగో||