MP3 Download (Right Click – Save Link As)

యిర్మీయా 33:6 – నేను వారికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. 

NEW: Click here for Bible Maps and Proofs

స్వస్థతపరచు యెహోవా నీవే నీ రక్తంతో మమ్ము కడుగు యేసయ్యా |2|

మా ఆరోగ్యం నీవే – ఆదరణ నీవే – ఆనందం నీవేగా |2| “స్వస్థత”

1. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాధి బాధలన్నీ |2|

శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం “స్వస్థత”

2. పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము |2|

క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము “స్వస్థత”