Deva Jali Choopumu MP3 (Click here to download)

దేవా జాలి చూపుము , నా ప్రార్థన నీవు ఆలకించుము |2|
వ్యర్ధమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పి వేయుము
హేయమైన మాటలు పలుకుకుండా నా నాలుక అదుపు చేయుము |2|
నా శరీరమందు ఏ పాపమును |2| ఏలనీయకుము |2| ||దేవా ||

అల్ప కాల భోగము ఆశించకుండా నీ కొరకే బ్రతుకనీయుము
క్షణికమైన వాంఛలను కోరకుండా నా హృదయము శుద్ధి చేయుము |2|
నా జీవిత మంతా నీదు చిత్తమే |2| నెరవేర్చ కృప చూపుము |2| ||దేవా ||

చేయగలిగినంత మేలు పొరుగు వానికి చేయుటకు మనసునీయుము
నశియించిపోతున్న ఆత్మలను రక్షింపగ శక్తి నీయుము |2|
నా బ్రతుకు ద్వారా లోకానికి |2| నీ నీతి ప్రకటింపనిమ్ము |2| ||దేవా ||