రేయింబవళ్ళలోన వెల్లేటి త్రోవలోన ||2||
యేసయ్య నేల మరతువు నీవు క్షణంబులోన లోకంబునిడుతువు ||2||

1. ఎక్కడికోయి నీవు యాత్రాపోయేది నీవు ||2||
నీ ఇల్లు స్థిరము కాదు ఒళ్ళు మరచెదవు ||2||
ఈలోకం నీది కాదు పరదేశివే నీవు
వచ్చిన దారినే వచ్చిన దారినే వెళ్లిపోవాలి ||రేయి||

2. సైతాను దారిలోన చుట్టు ఎడారి నీకు ||2||
ఇరుకైన దారిలోన బరువైన కాడిమోయ ||2||
ప్రధాన ఖడ్గముతో బయలుదేరాలి
ప్రభు యేసుని ప్రార్ధించి పూజించి సేవింపరారే ||రేయి||