Deva Samsthuthi MP3 (Click here):

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతు‌డగు యెహొవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా – నా జీవమా యెహొవా దేవుని
పావన నామము స్తుతించుమా – నా యంతరంగము లో వసించునో సమస్తమా “దేవ”
1. జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు – నీవు చేసిన పాతకంబులను
మన్నించి – జబ్బు లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే “దేవ”
2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను కృపను – జీవ కిరీటముగ వేయును
నీ శిరసు మీద – జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే “దేవ”
3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త – యౌవనంబై వెలయునట్లుగ
మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే “దేవ”
4. పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు
మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే “దేవ”
5. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును
జ్ఞాపకముచేసి కొనుచు కరుణ జూపు చుండును ఆ కారణముచే “దేవ”