———————————————————
లూకా సువార్త 21: 34 -మీ హృదయములు ఒకవేళ తిండివలనను, (లోక) మత్తువలనను, ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.

———————————————————
లూకా సువార్త 12:35-36 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.

———————————————————–

ప్రకటన 3:3 – నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము.

రాకడ సమయములో – కడబూర శబ్ధముతో
యేసుని చేరు కొనే – విశ్వాసము నీకుందా (2)
రావయ్య యేసయ్యా – వేగమే రావయ్యా – 2
1. యేసయ్య రాకడ సమయములో – ఎదురేగే రక్షణ నీకుందా?
లోకాశలపై విజయము నీకుందా? (2)
2. ఇంపైన దూప వేదికగా – ఏకాంత ప్రార్ధన నీకుందా? (2)
యేసుని ఆశించే దీన మనస్సుందా ? (2)
3. దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసు నాధునితో సహవాసం నీకుందా? (2)
4. శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం నీకుందా? (2)
5. నీ పాత రోత జీవితము – నీ ఘోర హృదయము మారిందా?(2)
నూతన హృదయముతో ఆరాధన నీకుందా ?(2)
6. అన్నిటి కన్న మిన్నగా – కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)
ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా? (2)