Prana tyagamu chesina – Maataladani Mounama MP3 (Click here)

ప్రాణ త్యాగము చేసిన నా దైవమా రక్తమంతా ఓర్చిన నా జీవమా ||2||

మాటలాడని మౌనమా మనసు తెలిసిన దైవమా
మరచిపోని స్నేహమా మోక్ష రాజ్యపు ద్వారమా
యేసు రాజా నీవె నాకిల జీవము నా జీవము
||మాటలాడని||

కఠినులైన మనుషులు సిలువ మ్రానును మోపిరి
కందిపోవు మోమున కంట నీరే నిలిపిరి ||2||
వారి హింసకు బదులుగా క్షమాపననే చూపిన
||మాటలాడని||

ముళ్ళతో కిరీటము అల్లి శిరస్సున గ్రుచ్చిరి
దాహమని నీవడిగిన చేదు చిరకని ఇచ్చిరి ||2||
దూషణలకు బదులుగా ఏమి తెలియని వారని ||2||
క్షమాపననే చూపిన ||మాటలాడని||